తెలంగాణ

telangana

దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె- రోగుల ఇక్కట్లు

'భారత వైద్య సంఘం' (ఐఎంఏ) ఆధ్వర్యంలో వైద్యులు దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. బంగాల్​లో జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళనలకు సంఘీభావంగా ఈ సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. వైద్యులపై దాడులను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

By

Published : Jun 17, 2019, 5:53 AM IST

Published : Jun 17, 2019, 5:53 AM IST

Updated : Jun 17, 2019, 7:43 AM IST

నేడు వైద్యుల దేశవ్యాప్త సమ్మె

వైద్యుల దేశవ్యాప్త సమ్మె

బంగాల్​లో వైద్యులు చేపట్టిన ఆందోళనలకు సంఘీభావంగా నేడు దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మెకు దిగారు. ఇందులో భాగంగా 'ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 24 గంటలపాటు 'సాధారణ వైద్య సేవలు' నిలిపివేస్తున్నట్లు 'భారత వైద్య సంఘం' (ఐఎంఏ) తెలిపింది.

సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటలవరకు అవుట్​ పేషెంట్​ (వోపీడీలు), సాధారణ చికిత్సలు, వార్డు విజిట్లు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ పేర్కొంది. అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది.

మేము దూరం..

ఐఎంఏ చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనబోమని ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ మెడికల్ సైన్సెస్​ (ఎయిమ్స్​) ప్రకటించింది. రోగుల సంక్షేమం దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

కఠిన చట్టాలు తీసుకురండి..

వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులు నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాల్ని తీసుకురావాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. వైద్య సిబ్బంది భద్రతపట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న విషయాన్నీ తెలపాలని కోరింది.

చర్చలు బహిరంగాగానే జరగాలి..

బంగాల్ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి అక్కడి జూనియర్ వైద్యులు ముందుకు వచ్చారు. ​తమ డిమాండ్లపై మాట్లాడేందుకు వేదిక ఎక్కడనేది సీఎం మమతా బెనర్జీయే ఎంచుకోవచ్చని, అయితే చర్చలు బహిరంగంగానే జరగాలని స్పష్టం చేశారు.

ఇదీ జరిగింది..

గత సోమవారం రాత్రి మరణించిన ఓ రోగి కుటుంబ సభ్యులు ఎన్​ఆర్​ఎస్​ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులపై దాడిచేశారు. నిరసనగా బంగాల్ వ్యాప్తంగా వైద్యులు విధులు బహిష్కరించారు. నేటికి సమ్మె 7వ రోజుకు చేరింది.

ఇదీ చూడండి: 'నిరుద్యోగం, రైతు సమస్యలే విపక్షాల అజెండా'

Last Updated : Jun 17, 2019, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details