తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విషం తాగినా పట్టించుకోని ఆసుపత్రులు

విషం తాగి విలవిల్లాడుతుంటే ఓ ఆసుపత్రి అసలే చేర్చుకోలేదు. మరో ఆసుపత్రికి వెళితే ముందు రూ.30 వేలు కడితే గానీ చేర్చుకోమని తెగేసి చెప్పింది. గత్యంతరం లేక ఆరుబయట అరుగు మీద పడుకోబెట్టి, సెలైన్లు ఎక్కించారు కుటుంబసభ్యులు.

hospital-turns-back-man-in-distress-after-suicide-attempt in belagavi
విషం తాగినా పట్టించుకోని ఆసుపత్రులు.. అరుగుపైనే సెలైన్లు!

By

Published : Aug 23, 2020, 5:47 PM IST

కర్ణాటక బెళగావిలో హృదయవిదారక ఘటన జరిగింది. విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని చేర్చుకోకుండా నిండు ప్రాణాలతో ఆడుకున్నాయి ఆసుపత్రులు.

విషం తాగినా పట్టించుకోని ఆసుపత్రులు.. అరుగుపైనే సెలైన్లు!

బెళగావి, నిదసోసి గ్రామానికి చెందిన దూరదుండి గౌరవ్.. వ్యక్తిగత కారణాల వల్ల ఆదివారం విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన గౌరవ్​ను... గుండెలు పగిలేలా ఏడుస్తూ శంకేశ్వర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. కానీ, కరోనా అనుమానంతో అతడ్ని చేర్చుకోలేదు ఆసుపత్రి సిబ్బంది. పైగా కరోనా బాధితులకు చికిత్స అందించే బీఐఎమ్ఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు.

చేసేదేమీ లేక, కేఎల్ఈ అనే మరో ఆసుపత్రికి గౌరవ్​ను తరలించారు. కానీ, ఈ సారి చేర్చుకుంటాం కానీ ముందే రూ.30 వేలు చెల్లించాలని మెలిక పెట్టారు ఆసుపత్రి సిబ్బంది. అంత డబ్బు కట్టలేక, దిక్కతోచని స్థితిలో ఆసుపత్రి బయట ఓ బెంచ్ మీద ప్రాణాలతో పోరాడుతున్న గౌరవ్​కు సెలైన్లు పెట్టించారు కుటుంబసభ్యులు.

ఇదీ చదవండి:'కెమెరా' ఇల్లు.. చూడటానికి చాలవు రెండు కళ్లు

ABOUT THE AUTHOR

...view details