తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా తండ్రి ఇకలేరు.. ప్రభుత్వం వల్ల ఓడిపోయాం'

అయిన వారికి కరోనా సోకిందన్న బాధ... వారి భవిష్యత్​ ఏంటోనన్న ఆందోళన... అయినా సమయానికి ఆస్పత్రిలో చేర్చి, వైద్యం అందించలేని దుస్థితి. ఇందుకు కారణం పేదరికమో, రోగుల్ని తీసుకెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడమో కాదు. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత వల్లే ఈ దుస్థితి. అది కూడా దేశ రాజధాని దిల్లీలో. ఎందుకిలా?

DL-VIRUS-HOSPITAL RUNAROUND
కరోనా విధ్యంసం

By

Published : Jun 12, 2020, 4:32 PM IST

కరోనా మహమ్మారి దేశ రాజధాని దిల్లీని వణికిస్తోంది. ఇప్పటివరకు 34 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వెయ్యి మంది మరణించారు. దిల్లీలో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో స్థానికులు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.

దిల్లీ వాసుల్లో వ్యాధి సంక్రమిస్తుందన్న భయం ఎంత ఉందో.. వైరస్​ సోకితే సరైన ఆసుపత్రిలో చికిత్స పొందగలమా అనే అనుమానాలు అంతే ఉన్నాయి. ప్రభుత్వం చెబుతున్న మాటల్లో పొంతన లేకపోవటం మరింత భయాందోళనలకు గురిచేస్తోందని వాపోతున్నారు.

ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్ భవిష్యత్తులో 1.5 లక్షల పడకలు అవసరమవుతాయని బుధవారం ఓ ప్రటనలో తెలిపారు. ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా గురువారం చేసిన ప్రకటన ఇందుకు భిన్నంగా ఉంది. జులై చివరి నాటికి కరోనా కేసులు 5.5 లక్షలకు పెరుగుతాయని చెబుతున్నారు. దేశ రాజధానిలో అవసరానికి మించి సరిపడా పడకలు ఉన్నాయని దిల్లీ ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

భిన్నంగా పరిస్థితులు..

కానీ... క్షేత్రస్థాయిలో వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో తమ కుటుంబ సభ్యుల పరిస్థితులను వివరిస్తూ పెడుతున్న పోస్టులు ఆందోళన కలిగిస్తున్నాయి. వైద్య సహాయం అందక చనిపోతున్నారని వాపోతుండటం చూస్తే దిల్లీ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

"నా తండ్రి ఇక లేరు.. ప్రభుత్వం వల్ల ఓడిపోయాం"

సామాజిక కార్యకర్త అమర్​ప్రీత్​ కౌర్​ ట్విట్టర్​లో చేసిన పోస్ట్​ ఇది. "నా తండ్రికి జూన్​ 1న కరోనా పాజిటివ్​గా తేలింది. కానీ, గృహ నిర్బంధంలో ఉండాలని వైద్యులు సూచించారు. పరిస్థితి విషమించగా దిల్లీ ప్రభుత్వం కరోనా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్​ఎన్​జేపీ ఆసుపత్రికి తీసుకెళ్లాం. కానీ వైద్యులు చేతులెత్తేయటం వల్ల ఆసుపత్రి బయటే ప్రాణాలు మా నాన్న విడిచారు" అని తెలిపారు కౌర్.

తండ్రి మరణానికి ముందు కౌర్ చేసిన ట్వీట్లు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

"నా తండ్రికి జ్వరం ఎక్కువగా ఉంది. ఎల్​ఎన్​జేపీ ఆసుపత్రికి వెళ్లాం. నా తండ్రిని అడ్మిట్ చేసుకునేందుకు వైద్యులు నిరాకరించారు. ఆయనకు కరోనా ఉంది. శ్వాస అందక ఇబ్బంది తీవ్రంగా పడుతున్నారు. వైద్య సాయం లేనిదే ఆయన బతకలేరు. దయచేసి సాయం చేయండి." అంటూ ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు కౌర్.

ఒక గంట తర్వాత.. "ఆసుపత్రి బయటే ఆయన చనిపోయారు" అని మరో ట్వీట్ చేసింది.

ఎల్​ఎన్​జేపీ వైద్యులు కౌర్​ ఆరోపణలను ఖండించారు.

ఇక్కడితో ఆమె కథ అయిపోలేదు.. కౌర్​ కుటుంబానికి కరోనా పరీక్షలు చేయాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు కూడా ఆమె ట్విట్టర్​ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆసుపత్రుల చుట్టూ తిరిగి..

ఈ విషయంలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ అమన్​ పాఠక్​ అదృష్టవంతుడని చెప్పాలి. అతని 51 ఏళ్ల తండ్రిని చేర్పించేందుకు చాలా ఆసుపత్రుల చుట్టూ తిరిగాల్సి వచ్చింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరికి ఎల్​ఎన్​జేపీలో ఇంటెన్సివ్​ కేర్​లో చికిత్స పొందుతున్నారు అమన్​ తండ్రి.

"మే 24న తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. తర్వాత కాస్త కోలుకున్నారు. తేలికపాటి లక్షణాలు ఉండటం వల్ల ఇంటి వద్దనే చూసుకోవాలని భావించాం. కానీ, జూన్​ 3న శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తగా ఆసుపత్రికి తీసుకెళ్లాం. ప్రభుత్వ, ప్రైవేటు ఇలా చాలా ఆసుపత్రుల చుట్టూ తిరిగాం. కానీ మా వైపు ఎవరు చూడలేదు.

జూన్​ 4న దిల్లీ ప్రభుత్వ అధీనంలోని అంబేడ్కర్ ఆసుపత్రిలో కరోనా పరీక్ష చేయించేందుకు వెళ్లాం. అక్కడ సరిగా స్పందించలేదు. ఒక రోజు తర్వాత టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్​గా తేలింది. అయినా ఆసుపత్రి దొరకలేదు. ఎక్కడికి వెళ్లినా బెడ్లు లేవని చెబుతున్నారు.

నా తండ్రి కనీసం నడవలేకపోతున్నారు. ఆ పరిస్థితుల్లో నేను తనను ఆసుపత్రికి తీసుకెళ్లాను. విసిగిపోయి సాయం కోరుతూ ట్వీట్లు చేశాను. చివరికి జూన్​ 6న అంబేడ్కర్​ ఆసుపత్రిలో చేర్పించగలిగాను. అక్కడి నుంచి ఎల్​ఎన్​జేపీకి మార్చారు. త్వరలోనే కోలుకుని ఇంటికి తిరిగి వస్తారని ఆశిస్తున్నా."

- అమన్ పాఠక్​

బయటకు చెప్పని వారెంతమంది?

దిల్లీలో కరోనా పాజిటివ్​గా తేలిన మరో టీనేజర్​ భోపాల్​లో మరణించాడు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. వీరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయటం వల్ల ఈ విషయాలు బయటకు వచ్చాయి. కానీ ఇందుకు భిన్నంగా దిల్లీ ప్రభుత్వం ఆసుపత్రుల్లో పడకలు ఉన్నాయనే చెబుతోంది.

విరుద్ధ ప్రకటనలా?

"మొత్తం 6,600 పడకలు ఉండగా.. 4,500 ఖాళీగానే ఉన్నాయి. జూన్​ వరకు ఈ పడకల సంఖ్యను 9,500కు పెంచుతాం" అని కేజ్రీవాల్​ మే 30న తెలిపారు.

దిల్లీలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 9,179 పడకలు ఉండగా, వీటిలో 50 శాతం అంటే 4,279 ఖాళీగా ఉన్నట్లు దిల్లీ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

ఇదీ చూడండి:'వారి మృతదేహాల నిర్వహణ భయానకం, దయనీయం'

ABOUT THE AUTHOR

...view details