ప్రయాణికుల ఆర్తనాదాలు.. అంబులెన్సుల సైరన్లు, మరోవైపు రక్తంతో తడిసిన బట్టలు.. భయంతో వణికిన చిన్నారులు.. ఇవీ నిన్న రాత్రి కోజికోడ్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం సమయంలో చోటుచుసుకున్న భయానక దృశ్యాలు.
దుబాయి నుంచి కోజికోడ్‌కు చేరుకున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వేపై జారిపడటంతో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 19మంది మరణించగా.. 100 మందికిపైగా గాయపడ్డారు. నిన్న రాత్రి అక్కడ నెలకొన్న భీతావహ దృశ్యాలను స్థానికులు వివరించారు.
ఓ వైపు భారీ వర్షం కురుస్తుండగానే సహాయక బృందాలు, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. రెండుగా విరిగిపోయిన విమాన శకలాల నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. కానీ ప్రయాణికులకు మాత్రం ఆ క్షణం ఏం జరిగిందో తెలియని ఆందోళన. ఆ భయానక క్షణాల్లో వారి అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. అంతేకాకుండా నాలుగైదేళ్ల చిన్నారులు, ప్రయాణికులు అనుభవించిన వేదన వర్ణనాతీతం. తీవ్ర ఆందోళనకు గురైన స్థానికులు సరైన సమయానికి అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు.
రక్తంతో తడిసిపోయాను..