తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్ వీడియో: ఒళ్లు గగుర్పొడిచేలా రౌడీ షీటర్ హత్య! - sunil murder in kadambha

కర్ణాటకలో ఎన్నో హత్యలు చేసిన ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ హోటల్ ముందు కారులో కూర్చున్న రౌడీ షీటర్ పై మరో గ్యాంగ్ దాడికి దిగింది. తప్పించుకునే ప్రయత్నం చేసినా వెంటాడి మరీ ముఖంపై కత్తులతో పొడిచి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Horrific Murder
లైవ్ వీడియో: ఒళ్లు గగుర్పొడిచే విధంగా రౌడీషీటర్ హత్య!

By

Published : Aug 1, 2020, 7:45 PM IST

కర్ణాటక, బెంగళూరులో దారుణం జరిగింది. ఎన్నో హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ బెస్తమనహల్లి సునీల్​ను.. అనేకల్​కు చెందిన మరో రౌడీ గ్యాంగ్ అత్యంత కిరాతకంగా హత్య చేసింది.

లైవ్ వీడియో: ఒళ్లు గగుర్పొడిచే విధంగా రౌడీ షీటర్ హత్య!

మైసూర్ రోడ్, కదంభాలోని ఓ హోటల్ ఎదురుగా.. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో హుండాయి వెర్నా ఫ్లూడిక్ కారులో కూర్చున్నాడు సునీల్. అదే సమయంలో దాదాపు ఆరుగురు వేట కొడవళ్లతో కారు అద్దలు పగులగొట్టి దాడికి దిగారు. తప్పించుకునే ప్రయత్నం చేసినా.. సునీల్ కారును కదలనీయకుండా చుట్టుముట్టారు రౌడీలు. విచక్షణారహితంగా కత్తులతో సునీల్​ను పొడిచి చంపారు. ఈ ఘటన హోటల్ సీసీటీవీలో రికార్డైంది.

సునీల్​ను కాపాడేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: మనవళ్లకు ప్రేమతో తాతయ్య 'గొర్రెల బండి'!

ABOUT THE AUTHOR

...view details