నిర్భయ దోషుల ఉరిశిక్షపై దిల్లీ కోర్టు స్టే విధించింది. కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన ఆశలన్నీ ఆవిరయ్యాయని వాపోయారు. దోషులను ఉరి తీసే వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు.
ఉరి తీసేవరకూ పోరాడుతా: నిర్భయ తల్లి - Hopes dashed but will fight till convicts are hanged: Nirbhaya's mother
నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదాపై.. బాధితురాలి తల్లి తీవ్రంగా స్పందించారు. తన ఆశలన్నీ ఆవిరయ్యాయని ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు.
ఉరి తీసేవరకూ పోరాడుతా: నిర్భయ తల్లి
"వారికి జీవించే హక్కు లేదు. వ్యవస్థలోని లోపాల వల్ల మేం నిరాశకు గురవుతూనే ఉన్నాం. దోషులకు ఉరి శిక్షపడే వరకూ నా పోరాటం ఆగదు. చట్టంలో లొసుగుల వల్లే.. నేరస్థులు ధైర్యంగా కోర్టులో తీర్పును సవాల్ చేస్తున్నారు."
-ఆశాదేవి, నిర్భయ తల్లి
Last Updated : Feb 28, 2020, 4:43 PM IST