తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఈ నెలలోనే కరోనా టీకాకు అనుమతులు!' - రణదీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్

దేశంలో కరోనా టీకా అత్యవసర వినియోగానికి ఈ నెల చివరి నాటికి అనుమతులు లభిస్తాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో తయారైన వ్యాక్సిన్​లు సురక్షితంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. టీకా సరఫరాకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ప్రాధాన్య క్రమంలో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనున్నట్లు వివరించారు.

Hopeful India will get Covid-19 vaccine nod by Dec end or early Jan: AIIMS Director Randeep Guleria
దేశంలో డిసెంబర్ చివర్లోనే కరోనా టీకా!

By

Published : Dec 3, 2020, 5:45 PM IST

భారత్​లో కరోనా టీకా అత్యవసర వినియోగానికి డిసెంబర్ చివర్లో లేదా జనవరి మొదట్లో అనుమతులు లభిస్తాయని ఆశిస్తున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణ​దీప్ గులేరియా పేర్కొన్నారు. ఒక్క సంవత్సరంలోనే టీకా తయారు కావడం గొప్ప విషయమన్నారు. టీకా తయారీదారులందరికీ ఇది ఉత్సాహాన్ని కలిగించే వార్త అని చెప్పారు.

ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. వ్యాక్సిన్ సురక్షితంగానే ఉందనే విషయాన్ని ధ్రువీకరించేందుకు సరైన గణాంకాలు ఉన్నాయని చెప్పారు. 78-80 వేల మంది వలంటీర్లు టీకా ట్రయల్స్​లో పాల్గొన్నారని, చెన్నై వలంటీర్ కేసు మినహా ఎక్కడా ప్రతికూల ప్రభావాలు తలెత్తలేదని తెలిపారు. స్వల్పకాలానికి వ్యాక్సిన్ సురక్షితమేనని తేలిందని వివరించారు.

"తుది దశకు చేరుకున్న టీకాలు భారత్​లో ఉన్నాయి. సీరం, భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్​లపై మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదట్లో టీకా అత్యవసర వినియోగానికి భారత నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు వస్తాయని ఆశాజనకంగా ఉన్నాం."

-డా. రణదీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్

వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు గులేరియా. కేంద్రంతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ వేగంగా పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. కోల్డ్ చైన్, గిడ్డంగులను సిద్ధం చేయడం సహా శిక్షితులైన సిబ్బంది, సిరంజీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

ప్రారంభంలోనే అందరికీ టీకా ఇచ్చే సామర్థ్యం ఉండదని గులేరియా పేర్కొన్నారు. ప్రాధాన్య క్రమంలో టీకా అందించేలా కేంద్రం వ్యూహాన్ని సిద్ధం చేస్తోందని వెల్లడించారు. మరణముప్పు అధికంగా ఉన్నవారికి ముందుగా టీకా వేసేలా ప్రాధాన్య జాబితా తయారు చేయాలని అన్నారు.

ఇవీ చదవండి-

ప్రజలందరికీ టీకా అవసరం లేదు: కేంద్రం

'మోదీదో మాట.. కేంద్రానిది మరో మాట.. ఎందుకిలా?'

ABOUT THE AUTHOR

...view details