తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొందరు వ్యక్తులు, సమూహాల ప్రవర్తన ఆందోళనకరం' - supreme

ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు, బృందాల నుంచి  పోట్లాట, నిర్లక్ష్య ధోరణులు ఎదురవుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ అన్నారు. న్యాయ వ్యవస్థ ముందు అవి నిలబడలేవని చెప్పారు. గువహటి హైకోర్టు ఆడిటోరియంకు శంకుస్థాపన చేశారు జస్టిస్ గొగొయి.

'కొందరు వ్యక్తులు, సమూహాల ప్రవర్తన ఆందోళనకరం'

By

Published : Aug 4, 2019, 6:54 PM IST

అసోం గువహటిలో హైకోర్టు ఆడిటోరియంకు శంకుస్థాపన చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి. కార్యక్రమం అనంతరం ప్రసంగించారు. ప్రస్తుత సమాజంలో కొందరు వ్యక్తులు, సమూహాల ప్రవర్తన ఆందోళనకరంగా ఉందన్నారు. ఇతరులను రెచ్చగొట్టే, నిర్లక్ష్య ధోరణులు ఎదురవుతున్నాయన్నారు జస్టిస్ గొగొయి. అయితే దృఢమైన మూలాలు గల దేశ న్యాయ వ్యవస్థ ముందు అవి నిలబడలేవని ధీమా వ్యక్తంచేశారు.

న్యాయ వ్యవస్థను ప్రజలు విశ్వసించాలి...

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు జస్టిస్​ గొగొయి. దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా కేసులు యాభై ఏళ్లుగా, రెండు లక్షలకుపైగా కేసులు 25ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దాదాపు తొంభై లక్షల పెండింగ్‌ సివిల్‌ కేసులలో 20 లక్షలు కేసులకు సమన్లు కూడా జారీ చేయలేదని వెల్లడించారు. న్యాయమూర్తులు ఇచ్చే సరైన తీర్పుల ఆధారంగానే కోర్టులపై ప్రజలకు విశ్వాసాలు పెరుగుతాయని చెప్పారు.

ఇతర ప్రభుత్వ సంస్థలు, కార్యలాయాలతో పోల్చితే కోర్టుల పనీతీరు భిన్నం అని చెప్పారు జస్టిస్ గొగొయి.

ఇదీ చూడండి: కాంగ్రెస్​కు కొత్త సారథిపై ఈనెల 10న స్పష్టత!

ABOUT THE AUTHOR

...view details