తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అమర్​నాథ్​ యాత్ర' ఏర్పాట్లపై కేంద్రం కసరత్తు

జూలై నెలలో ప్రారంభమయ్యే పవిత్ర అమర్​నాథ్ యాత్ర ఏర్పాట్లపై హోంశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. యాత్ర కోసం చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జమ్ముకశ్మీర్ గవర్నర్ మాలిక్​తో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేశ్వర్ కుమార్​ చర్చించారు.

'అమర్​నాథ్​ యాత్ర' ఏర్పాట్లపై కేంద్రం కసరత్తు

By

Published : Jun 7, 2019, 11:21 PM IST

జులై 1 నుంచి అమర్​నాథ్​ యాత్ర ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. సమీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్​ గవర్నర్ ఎస్​పీ మాలిక్​తో కేంద్రహోంమంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేశ్​ కుమార్​ శుక్రవారం చర్చలు జరిపారు.

యాత్ర కోసం చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్ల గురించి గవర్నర్ మాలిక్​కు జ్ఞానేశ్ కుమార్ వివరించారు. యాత్ర సమయంలో భక్తులకు సౌకర్యాల కల్పన... భద్రతా చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. ఈ చర్చలో గవర్నర్​ మాలిక్​, జ్ఞానేశ్​కుమార్​తో పాటు నిఘా సంస్థ​ అధికారులు కూడా పాల్గొన్నారు.

జమ్ముకశ్మీర్ పోలీసులు, నిఘా సంస్థలు, రాష్ట్ర పాలనాధికారులతో జరిగిన విస్తృత సమావేశాల గురించి గవర్నర్​కు అదనపు కార్యదర్శి వివరించారు. పహల్గామ్​, బాల్టల్​ మార్గాల్లో చేపట్టాల్సిన నిఘా ఏర్పాట్ల గురించీ చర్చించారు.

ఇదీ చూడండి: 'ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం కావాలి'

ABOUT THE AUTHOR

...view details