తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుడ్​ న్యూస్: ఆ శాఖలో కొత్తగా వెయ్యికిపైగా పోస్టులు

వెయ్యికి పైగా కొత్త ఉద్యోగాల సృష్టికి పచ్చజెండా ఊపింది కేంద్ర హోంశాఖ. సీఐఎస్​ఎఫ్​లో భద్రత, ఇతర నూతన ఉద్యోగాలు కల్పించేందుకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా రాబోయే రెండేళ్లలో కొత్త బెటాలియన్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

By

Published : Mar 20, 2020, 2:00 PM IST

cisf
ఆ శాఖలో కొత్తగా వెయ్యికిపైగా పోస్టులు

కేంద్ర హోంశాఖ.. వెయ్యికి పైగా కొత్త ఉద్యోగాల నియామకానికి పచ్చ జెండా ఊపింది. పరిశ్రమలు, విమానాశ్రయాలు, అణు ఉత్పత్తి కేంద్రాలు, మెట్రో స్టేషన్లు వంటి ప్రదేశాల్లో విధులు నిర్వహించే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలో(సీఐఎస్​ఎఫ్​) నూతనంగా 1,018 పోస్టుల సృష్టికి కేంద్ర హోంశాఖ ఆమోద ముద్ర వేసింది.

ప్రస్తుతం సీఐఎస్​ఎఫ్ 60 విమానాశ్రయాల్లో విధులు నిర్వహిస్తోంది. వీవీఐపీల భద్రత కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్(ఎస్​ఎస్​జీ) కూడా సీఐఎస్​ఎఫ్ విభాగంలోనే పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో సీఐఎస్​ఎఫ్​లో 899 పోస్టులు, 119 ఇతర ఉద్యోగాల కల్పనకు ఆమోదం తెలిపింది హోంశాఖ.

నూతనంగా జారీ చేయనున్న ఉద్యోగాలతో.. రాబోయే రెండేళ్లలో నూతన బెటాలియన్​ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం సీఐఎస్​ఎఫ్​లో 1,08,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.

ముంబయి దాడుల అనంతరం..

2008 నాటి ముంబయి దాడుల్లో తాజ్​ హోటల్లో జరిగిన విధ్వంసం నేపథ్యంలో ప్రైవేటు సంస్థలకు భద్రత కల్పించే బాధ్యతనూ సీఐఎస్​ఎఫ్​కు అప్పగించారు. ఇలా 12 పైగా ప్రైవేటు సంస్థలకు సేవలు అందిస్తోంది సీఐఎస్​ఎఫ్.

ఇదీ చూడండి:కరోనా వల్ల వరుడు లేకుండానే పెళ్లి అయిపోయింది!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details