దేశంలో ప్రైవేటు పారిశ్రామిక రంగంలో కరోనా సోకిన బాధితులు సంఖ్య, ఆ వ్యాధి బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో వారికి అందజేసే పరిహారం మొత్తాన్ని నిర్ణయించే అధికారాన్ని ప్రైవేటు సంస్థలకే విడిచిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
"ప్రస్తుతం ఉన్న చట్టాల్లో కొవిడ్-19 లేనందున.. ఇందుకు సంబంధించిన ఎలాంటి పరిహారమైనా ప్రైవేటు కంపెనీలే నిర్ణయించాలి. కరోనా బారిన పడిన కార్మికులు, చనిపోయిన కార్మికులను పారిశ్రామిక అనారోగ్యం, మరణాల కింద పరిగణించాలా? వద్దా? అనేది యాజమాన్యం నిర్ణయించుకోవాలి. అప్పుడే పరిహారాన్ని నిర్ణయించగలరు"
-కేంద్ర కార్మిక శాఖాధికారి.