తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మందుబాబులకు ఇంటికే మద్యం.. 'సర్కార్'​ గ్రీన్​ సిగ్నల్​

పంజాబ్​లో లాక్​డౌన్​ కారణంగా నిలిచిపోయిన మద్యం అమ్మకాలను పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది స్థానిక కాంగ్రెస్​ సర్కారు. దీంతో నేటి నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే భౌతిక దూరం నిబంధన అమల్లో ఉండటం వల్ల.. అవసరమైన వారికి నేరుగా ఇంటికి కూడా మద్యం పంపిణీ చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది సర్కారు.

Home delivery of liquor to start in Punjab from May 7
ఆ రాష్ట్రంలోని మందుబాబులకు ఇంటికే మద్యం

By

Published : May 7, 2020, 5:46 PM IST

కరోనా వ్యాప్తితో ఇన్నాళ్లు మూతపడిన మద్యం దుకాణాలకు అనుమతినిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. పంజాబ్​ కూడా గురువారం నుంచి​ మద్యం అమ్మకాలు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. లాక్​డౌన్​ నుంచి సడలింపులు పొందిన ప్రాంతాల్లో వీటికి అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే భౌతిక దూరం నిబంధన అమల్లో ఉండటం వల్ల.. అవసరమైన వారికి ఇంటికి కూడా మద్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది అమరీందర్​ సర్కారు.

చట్టంలో లేనప్పటికీ..

పంజాబ్​ ఎక్సైజ్​ చట్టం-1914 ప్రకారం- ఇంటికి మద్యం పంపిణీ చేసే అనుమతి లేనప్పటికీ.. కొవిడ్​ మహమ్మారి నేపథ్యంలో భౌతిక దూరం పాటించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు అధికారులు. అయితే ఎక్సైజ్​ శాఖ అధికారులతో చర్చించాకే హోమ్​ డెలివరీ సమయాన్ని నిర్ణయించనున్నారు.

కేవలం లాక్​డౌన్​ కాలంలోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్న అధికారులు.. ఒక్కో కొనుగోలుదారునికి రెండు లీటర్ల మద్యం వరకు పరిమితి విధించారు. హోమ్​ డెలివరీ చేసే వ్యక్తులకు డిపార్ట్​మెంట్ నుంచి గుర్తింపు కార్డులతో సహా.. ప్రత్యేక కర్ఫ్యూ పాస్​లను ఇవ్వనున్నారు. అయితే పంజాబ్​ మీడియం లిక్కర్​(పీఎంఎల్​)కు హోమ్​ డెలివరీ అనుమతిని నిరాకరించారు.

ఇదీ చదవండి:భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో...

ABOUT THE AUTHOR

...view details