తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉగ్ర ముప్పు'పై హోంమంత్రి షా ఉన్నతస్థాయి సమీక్ష

దేశంలో ఉగ్రహెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా దిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​, కేబినెట్​ సెక్రటరీ, ఇతర నిఘా సంస్థల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

'ఉగ్ర ముప్పు'పై హోంమంత్రి షా ఉన్నతస్థాయి సమీక్ష

By

Published : Sep 16, 2019, 3:11 PM IST

Updated : Sep 30, 2019, 8:10 PM IST

'ఉగ్ర ముప్పు'పై హోంమంత్రి షా ఉన్నతస్థాయి సమీక్ష

పాక్​ ఆక్రమిత కశ్మీర్​ నుంచి దాదాపు 230 మంది ఉగ్రవాదులు దేశంలో చొరబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో కేంద్రం అప్రమత్తమైంది. జమ్ముకశ్మీర్​ భద్రతా పరిస్థితులపై హోం మంత్రి అమిత్​ షా దిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అక్కడి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​, కేబినెట్​ కార్యదర్శి రాజీవ్​ గౌబా, ఇతర నిఘా సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2 గంటలకు పైగా జరిగిన భేటీలో జమ్ముకశ్మీర్​ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తాజా పరిస్థితులను అమిత్​ షాకు నివేదించారు.

కశ్మీర్​ లోయతో పాటు సరిహద్దు వెంట ప్రశాంత వాతావరణం సృష్టించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

సరిహద్దు వెంబడి ఇటీవల అక్రమ చొరబాటు ప్రయత్నాలు పెరిగాయని లెఫ్టినెంట్​ జనరల్​ కేజేఎస్​ ధిల్లాన్​ పేర్కొన్నారు. పాక్​ ఉగ్రవాదులు భారత్​లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడే అవకాశముందని హెచ్చరించారు.

మోదీతో మాలిక్​ భేటీ

జమ్ముకశ్మీర్​ గవర్నర్​ సత్యపాల్​ మాలిక్.. ప్రధానితో భేటీ అయ్యారు. కశ్మీర్​ లోయలో ప్రస్తుత​ భద్రతా పరిస్థితులపై ప్రధాని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

అధికరణ 370 రద్దు అనంతరం.. కశ్మీర్​లో వరుసగా 43వ రోజూ సాధారణ జనజీవనం ప్రభావితమైంది. పలు చోట్ల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అంతర్జాల సేవలు చాలా చోట్ల నిలిచిపోయాయి. తాజాగా ఉగ్రహెచ్చరికల నేపథ్యంలో కశ్మీర్​లోయలోని పలు ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.

Last Updated : Sep 30, 2019, 8:10 PM IST

ABOUT THE AUTHOR

...view details