తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే కార్డుపై ఆధార్​, పాస్​పోర్ట్, డ్రైవింగ్​ లైసెన్స్​!

అన్ని కార్డులను కలిపి ఒకే గుర్తింపు కార్డు ఉండాలని అమిత్​ షా అభిప్రాయపడ్డారు. 2021 జనాభా లెక్కలను యాప్​ ద్వారా సేకరించనున్నట్టు వెల్లడించారు కేంద్ర హోంమంత్రి.

ఒకే కార్డుపై ఆధార్​, పాస్​పోర్ట్, డ్రైవింగ్​ లైసెన్స్​!

By

Published : Sep 23, 2019, 2:02 PM IST

Updated : Oct 1, 2019, 4:47 PM IST

ఒకే కార్డుపై ఆధార్​, పాస్​పోర్ట్, డ్రైవింగ్​ లైసెన్స్​!

ఆధార్​, పాస్​పోర్టు, డ్రైవింగ్​ లైసెన్సు, బ్యాంక్​ కార్డులు, ఓటర్​ కార్డు.. ఇలా మన జేబులో లెక్కలేనన్ని కార్డులు ఉంటున్నాయి. అయితే త్వరలోనే వీటన్నిటినీ కలిపి ఒకే గుర్తింపు కార్డు రానుందా? కేంద్ర హోంమంత్రి అమిత్​ షా తాజా వ్యాఖ్యలు ఈ ప్రశ్నకు జవాబిచ్చేలా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఉన్న కార్డులకు బదులు ఒకే గుర్తింపు కార్డు తీసుకురావాలని అమిత్​ షా ప్రతిపాదించారు. దీనిపై ఉన్నతస్థాయి చర్చలు జరిగే అవకాశముంది.
2021 జనాభా లెక్కలను మొబైల్​ యాప్స్​ ద్వారా సేకరించనున్నట్టు ప్రకటించారు అమిత్​ షా. దేశ ప్రజలు ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధిపొందడానికి ఈ జనాభా లెక్కలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు కేంద్రమంత్రి.

"ఇన్ని కార్డులకు మనం స్వస్తి పలకాలి. ఆధార్​కార్డు, ఓటర్​ కార్డు, గుర్తింపు కార్డు, జనాభా లెక్కల ఆధారాలు... ఇలా అన్నిటికీ సాఫ్ట్​వేర్​ సహాయంతో ఒక్కటే కార్డు ఉండాలి. అందులోనే బ్యాంక్​ కార్డు ఉండాలి. వీటన్నిటి కోసం ఈ డిజిటల్​ జనాభా లెక్కింపు చర్యలు రానున్న రోజుల్లో ఉపయోగపడనున్నాయి."
--- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

ఓ వ్యక్త మరణిస్తే... ఆ డేటా జనాభా లెక్కల్లో ఆటోమెటిక్​గా అప్​డేట్​ అయ్యే వ్యవస్థ ఉండాలని షా అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:-మోదీ తెలుగు డైలాగ్​పై చిదంబరం ఇంగ్లిష్ పంచ్​

Last Updated : Oct 1, 2019, 4:47 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details