కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి సోమవారం డిశ్చార్జి అయ్యారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఆసుపత్రి నుంచి అమిత్ షా డిశ్చార్జ్
ఆసుపత్రి నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిశ్చార్జి అయ్యారు. ఈ నెల 18న ఎయిమ్స్‌లో చేరిన ఆయన సోమవారం డిశ్చార్జి అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఆస్పత్రి నుంచి అమిత్ షా డిశ్చార్జి
55 ఏళ్ల అమిత్‌షాకు ఈ నెల 2న కరోనా సోకగా.. మెదంత ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం నెగెటివ్ రావడం వల్ల డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత అలసట, ఒళ్లు నొప్పులు వంటి కారణాలతో ఆగస్టు 18న ఎయిమ్స్‌లో చేరారు.