తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో మళ్లీ హిజ్బుల్​ ఉగ్రసంస్థ పాగా! - హిజ్బుల్‌ ముజాహిద్దీన్

ఉగ్రవాద సంస్థ హిజ్బుల్​ ముజాహిద్దీన్​ కశ్మీర్​లో మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తుందని సైన్యాధికారులు తెలిపారు. బారాముల్లాలో ముగ్గురు హిజ్బుల్ ఉగ్రమూకలను హతమార్చిన సైనిక బలగాలు ఈ మేరకు వెల్లడించాయి.

Hizbul trying to reestablish its base in North Kashmir: Army
కశ్మీర్​లో మళ్లీ ఆ ఉగ్రవాద సంస్థ పాగా!

By

Published : Sep 5, 2020, 4:50 PM IST

హిజ్బుల్‌ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ ఉత్తర కశ్మీర్‌లో మళ్లీ బలపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. బారాముల్లాలో ఆ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన బలగాలు ఈ మేరకు తెలిపాయి.

గత కొంత కాలంగా కేవలం లష్కర్ ఏ తోయిబా ఉగ్రతండా లేదా జైష్‌ఏ మొహ్మద్‌కి చెందిన ఉగ్రమూక మాత్రమే కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తుండగా... వారిని భద్రతా బలగాలు మట్టుపెడుతున్నాయి. అయితే కొన్నేళ్లు తర్వాత బారాముల్లాలో ముగ్గురు హిజ్బుల్ ఉగ్రమూకలు... సైనికులకు తారసపడం వల్ల ఆ సంస్థ కార్యకలాపాలను మళ్లీ మొదలుపెట్టాలని యోచిస్తున్నట్లు సైన్యం పేర్కొంది.

సైన్యం ముందు కుదరవు

ఉగ్ర సంస్థల ఆగడాలు సైన్యం ముందు కుదరవని.. బలగాలు సమర్థంగా తిప్పికొడతాయని ఉన్నతాధికారులు తెలిపారు. ఎవరైనా ఉగ్రపంథాని వీడి జనజీవనస్రవంతిలోకి వద్దామనుకుంటే తాము స్వాగతిస్తామని సైన్యం తెలిపింది. అలా కాకుండా ఉగ్రవాదిగా మారాలనుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఇదీ చూడండి:ఫోన్ నుంచి పొలంలో 'ఇస్మార్ట్ వ్యవసాయం'!

ABOUT THE AUTHOR

...view details