తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిజ్బుల్​ చీఫ్​ సహా 18 మందిపై 'ఉగ్ర'ముద్ర - హిజ్బుల్​ ముజాహిదీన్​ చీఫ్​ సయ్యద్​ సలాహుద్దీన్

హిజ్బుల్​ ముజాహిదీన్​ చీఫ్​ సయ్యద్​ సలాహుద్దీన్​ సహా పాకిస్థాన్​కు చెందిన 18 మందిని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. యూఏపీఏ కింద ఈ చర్యలు తీసుకుంది.

Hizbul Mujahideen chief Syed Sallahuddin, Indian Mujahideen's Bhatkal brothers designated as "terrorists" under UAPA: Home Ministry.
మరో 18 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్రం

By

Published : Oct 27, 2020, 2:26 PM IST

18 మంది పాకిస్థాన్​కు చెందిన వారిని ఉగ్రవాదులుగా ప్రకటించింది కేంద్రం. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం(యూఏపీఏ) కింద వీరిపై చర్యలు తీసుకుంది.

ఈ మేరకు ఉగ్రవాదుల జాబితాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 26/11 ముంబయి ఉగ్రదాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా(ఎల్​ఈటీ)కు చెందిన యూసుఫ్​ ముజామిల్​, ఎల్​ఈటీ చీఫ్​ హఫీజ్​ సయీద్​ బంధువు అబ్దుర్​ రెహ్మాన్​ సహా యూసుఫ్​ అజార్​, టైగర్​ మెమన్​,చోటా షకీల్​ ఇందులో ఉన్నారు.

దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని వీరిపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది హోం శాఖ.

ABOUT THE AUTHOR

...view details