తమిళనాడు కోయంబత్తూర్లోని పాలమేడులోని ఓ ఇంట్లో విషవాయువు కారణంగా విషాదం నెలకొంది. 49 ఏళ్ల బాలాజీ ఇంట్లో విషవాయుపు వ్యాపించిన కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. హుడ్కో కాలనీలో నివాసముంటున్న వీరి కుటుంబంలో మరో ఇద్దరు తీవ్ర అస్వస్థకు గురయ్యారు.
సోమవారం ఉదయం 2:30గంటల సమయంలో బాలాజీ తండ్రి శ్రీధర్(72) బాత్రూంలో అపస్మారక స్థితిలో పడిపోయారు. అతని కోసం వెళ్లిన బాలజీ అతని సోదరుడు మురళి(45) అక్కడే పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన వీరి తల్లి పద్మావతి పొరుగు వారికి విషయం చెప్పారు. స్థానికుల సాయంతో ముగ్గురినీ ఆస్పత్రికి తరలించారు. బాలాజీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతని తండ్రి, సోదరునికి చికిత్స అందిస్తున్నారు.