తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాహుల్ అవసరం భారత్​కు లేదు.. మోదీ స్వయంకృషీవలుడు' - మోదీ స్వయంకృషితో ఎదిగాడన్న రామచంద్రగుహ

కేరళ కోజికోడ్​లో జరుగుతున్న సాహిత్యోత్సవంలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సునిశిత వ్యాఖ్యలు చేశారు. ఐదో తరం రాజకీయ వారసుడిని యువభారత్ కోరుకోవడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంకృషితో ఎదిగిన నేత అని కొనియాడారు.

Historian Ramachandra Guha
మోదీ స్వయంకృషితో ఎదిగాడు: రామచంద్రగుహ

By

Published : Jan 18, 2020, 9:33 AM IST

Updated : Jan 18, 2020, 1:44 PM IST

'రాహుల్ అవసరం భారత్​కు లేదు.. మోదీ స్వయంకృషీవలుడు'

ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సునిశిత వ్యాఖ్యలు చేశారు. ఐదో తరం రాజకీయ వారసుడిని భారత యువత కోరుకోవడం లేదన్నారు. కేరళ కోజికోడ్​లో నిర్వహించిన సాహితీ ఉత్సవంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు గుహ.

"మలయాళీలు రాహుల్​ను ఎంపీగా ఎందుకు ఎన్నుకున్నారు? రాహుల్​పై వ్యక్తిగతంగా నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. రాహుల్ చాలా మంచి, మర్యాదగల వ్యక్తి. అయిదో తరం రాజకీయ వారసుడు యువ భారత్​కు అక్కరలేదు."
-రామచంద్రగుహ, చరిత్రకారుడు

మలయాళీలు 2024లోనూ రాహుల్​నే తిరిగి ఎన్నుకొని తప్పు చేస్తే అది ప్రధాని మోదీకే ప్రయోజనం కలిగిస్తుందన్నాకు గుహ. రాహుల్​ కాకపోవడమే మోదీకి గొప్ప ప్రయోజనమన్నారు.

మోదీ స్వయంకృషీవలుడు

ప్రధాని నరేంద్ర మోదీ స్వయంకృషితో ఎదిగారని రామచంద్రగుహ ప్రశంసించారు. ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పాలించిన అనుభవం ఉందన్నారు. మోదీ నిత్య కృషీవలుడిగా ఉంటారని.. విహార యాత్రలకు యూరప్​ వెళ్లరని అన్నారు. ఇదంతా మనఃస్ఫూర్తిగా చెబుతున్నట్లు రామచంద్రగుహ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:చైనాను వణికిస్తున్న కరోనా వైరస్​... భారత్​ అప్రమత్తం

Last Updated : Jan 18, 2020, 1:44 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details