తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామమందిర నిర్మాణం ప్రారంభం ఆ రోజే!

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక మంది వాస్తుశిల్పులు తమతమ డిజైన్లతో సిద్ధంగా ఉండగా.. అయోధ్యలో శివుని రూపమైన శశాంక్ శేఖరునికి జూన్​ 10న అభిషేకం నిర్వహించాలని రామజన్మభూమి న్యాస్ నిర్ణయించింది. ఈ కార్యక్రమంతోనే నిర్మాణం ప్రారంభమవుతుందని సమాచారం.

Ram temple construction
రామమందిర నిర్మాణం

By

Published : Jun 8, 2020, 2:31 PM IST

అయోధ్యలో శివుని రూపమైన శశాంక్ శేఖరునికి రామ్ జన్మభూమి న్యాస్​ ప్రతినిధులు అభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జూన్​ 10న ప్రార్థనా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

"మట్టిదిబ్బకు వెళ్లి శశాంక్ శేఖర్ విగ్రహాన్ని పరిశీలించాం. అక్కడ ప్రార్థన సమావేశాన్ని నిర్వహించి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము."

- మహంత్​ కమల్​ నయన్ దాస్​, రామజన్మభూమి న్యాస్​ సభ్యుడు

ఈ వేడుక బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై రెండు గంటలపాటు కొనసాగుతుందని తెలిపారు కమల్ నయన్​ దాస్.

లంకకు వెళ్లేముందు ఇక్కడే శివలింగానికి రాముడు అభిషేకం చేసినట్లు చాలా మంది విశ్వసిస్తారు.

రామమందిర నిర్మాణం

వచ్చే వారంలో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీనియర్​ సభ్యులకు మందిర డిజైన్​ను ప్రదర్శించేందుకు అనేకమంది వాస్తుశిల్పులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో శివుడికి అభిషేకం కార్యక్రమంతో రామ మందిర నిర్మాణానికి నాంది పలుకుతారని చాలామంది అంచనా వేస్తున్నారు.

రామమందిర డిజైన్

ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు- మాస్కులతో భక్తులు

ABOUT THE AUTHOR

...view details