బంగాల్లో మత సామరస్యానిక ప్రతీకగా నిలిచే ఘటన ఒకటి జరిగింది. చిరులియా గ్రామంలో హిందు మతానికి చెందిన రామ్ధను రజాక్ అనే వ్యక్తి అంతిమ సంస్కారాలను స్థానికంగా ఉండే ముస్లింలు నిర్వహించారు. ఈ గ్రామం ప్రముఖ కవి అయిన కాజీ నజ్రూల్ ఇస్లామ్ జన్మస్థలం. నజ్రూల్ ముఖ్యంగా మత సామరస్యం పరమళించే కవిత్వంతో ఆకట్టుకుంటే గ్రామస్థులు మాత్రం చేతల్లో చేసి చూపిస్తున్నారు.
బంగాల్లో వెల్లివిరిసిన మత సామరస్యం - అంతిమ సంస్కారాలు నిర్వహించిన ముస్లింలు
బంగాల్లో మత సామరస్యం వెల్లివిరిసింది. ప్రముఖ బంగాలీ కవి కాజీ నజ్రూల్ ఇస్లామ్ సొంత గ్రామమైన చురులియాలో హిందూ మతానికి చెందిన రామ్ధను రజాక్ అంత్యక్రియలను స్థానికంగా ఉండే ముస్లింలు నిర్వహించి పర మత సహనాన్ని చాటుకున్నారు.

బంగాల్లో వెల్లివిరిసిన మత సామరస్యం
బంగాల్లో వెల్లివిరిసిన మత సామరస్యం
మరణించిన రామ్ధను రజాక్ కు ఇద్దరు కూమారులు. వారిలో ఒకరు స్థానికంగా లేరు. మరొకరు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అన్నీ తామై ముస్లింలు అంతిమ సంస్కారాలను హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు.
ఇదీ చూడండి: మోదీ 'టీకా టూర్'పై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు
Last Updated : Nov 30, 2020, 11:36 AM IST