హిమాచల్‌ప్రదేశ్‌లో కొద్ది రోజులుగా భారీగా మంచు కురుస్తోంది. ఎడతెరిపిలేని హిమపాతం.. ఇళ్లు, రహదారులు, పర్యటక ప్రాంతాల్ని పూర్తిగా కప్పేసింది. ప్రముఖ పర్యటక ప్రాంతం సిమ్లాలో రహదారులన్నీ మంచుతో పేరుకుపోయాయి.
భారీ హిమపాతంతో 295 రహదారులు బంద్
కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండటం వల్ల హిమాచల్ ప్రదేశ్‌లోని 295 రహదారులను మూసివేశారు అధికారులు. రోడ్లన్ని మంచుతో కప్పేసిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు.
హిమపాతం కారణంగా 295 రహదారులు బంద్
రోడ్లన్ని మంచుతో దుప్పటి కప్పేసిన వేళ ఎలాంటి ప్రమాదాలు జరగుకుండా.. పలు ప్రాంతాల్లో రహదారులు మూసివేశారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా మెుత్తం 295 రహదారులు మూసివేశామని తెలిపారు. భారీ హిమపాతం కారణంగా 639 విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ పేర్కొంది.
ఇదీ చూడండి:మంచు దుప్పటిలో సిమ్లా.. టాయ్ ట్రెయిన్లో రయ్రయ్