1995 కేజీల కిచిడీని రూపొందించి హిమాచల్ ప్రదేశ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా తట్టపాణి గ్రామంలో.. హాలీడే హోం హోటల్‌కు చెందినమొత్తం 25మంది చెఫ్‌లు కలిసి ఈ కిచిడీని తయారు చేశారు. దీనితో గత ఏడాది ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ తయారు చేసిన 918కేజీల కిచిడీ రికార్డు బద్దలైంది.
ఇంత మొత్తంలో కిచిడీని రూపొందించడానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. ఈ కిచిడీ తయారీకీ 270కేజీల బరువు ఉన్న పాత్రను వినియోగించారు. తయారీ అనంతరం.. వడ్డించడం కోసం ఈ పాత్రను మోయడానికి ఓ భారీ క్రేన్‌ను ఉపయోగించాల్సి వచ్చింది.
రాష్ట్ర పర్యటక శాఖ, పౌర విమానయాన శాఖ సమక్షంలో గిన్నీస్ బుక్ రికార్డు సర్టిఫికేట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి జయ్ రామ్ ఠాకూర్ అందుకున్నారు.