హిమాచల్ ప్రదేశ్లో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. 20మందికి తీవ్రగాయాలయ్యాయి.
లోయలో పడ్డ బస్సు - 12మంది మృతి - చంబా జిల్లా
హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లా పంజ్పులా వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 12మంది మృతి చెందారు. 20మందికి తీవ్రగాయాలయ్యాయి.
![లోయలో పడ్డ బస్సు - 12మంది మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3124831-thumbnail-3x2-bus.jpg)
లోయలో పడ్డ బస్సు - ఎనిమిది మంది మృతి
పఠాన్కోట్ నుంచి డల్హౌసీకి వెళ్తున్న బస్సు చంబా జిల్లా పంజ్పులా వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను డల్హౌసీ సీహెచ్సీకి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం చంబా జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Last Updated : Apr 27, 2019, 10:42 PM IST