తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'న్యూఇయర్​ కానుకగా రైల్ ఛార్జీలు, గ్యాస్​ ధరల పెంపు' - new year latest news

రైలు ఛార్జీలు, ఎల్పీజీ ధరల పెంపును విపక్షాలు తప్పుబట్టాయి. కేంద్రం సామాన్యులను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోందని కాంగ్రెస్​, సిపీఎం విమర్శించాయి.

Hike in rail fares, price of LPG cylinders will put common man into deeper financial crisis: oposission
'న్యూఇయర్​ కానుకగా రైల్ ఛార్జీలు, గ్యాస్​ ధరల పెంపు'

By

Published : Jan 1, 2020, 4:44 PM IST

కొత్త ఏడాది మొదటి రోజు నుంచి రైలు ఛార్జీలు, ఎల్పీజీ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ధ్వజమెత్తాయి. ఈ నిర్ణయం సామాన్యులను తీవ్ర సంక్షోభంలోకి నెడుతుందని కాంగ్రెస్​ ఆరోపించింది. పేద ప్రజలకు నూతన ఏడాదికి ప్రభుత్వం ఇచ్చే బహుమానం ఇదేనా అని ఆ పార్టీ​ అధికార ప్రతినిధి సుష్మితా దేవ్​ ప్రశ్నించారు.

వామపక్షాలదీ అదే మాట...

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్​ ఏచూరి ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు.

రైలు ఛార్జీలు, ఎల్పీజీ ధరల పెంపుపై సీతారామ్​ ఏచూరి కామెంట్​

"కొత్త ఏడాదిని మోదీ మొదలుపెట్టారు. ప్రయాణికుల టికెట్టు ధరల పెంపుతో వారిపై పెను భారం మోపారు. ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోవడం, ఆహార ధరలు పెరగడం, గ్రామీణ వేతనాలు రికార్డు స్థాయిలో పడిపోవడం వంటి ఎన్నో పరిణామాలు చొటుచేసుకున్నాయి."

-సీతారామ్​ ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి

డిసెంబరు 31 అర్ధరాత్రి నుంచి రైలు ఛార్జీలును కిలోమీటరుకు నాలుగు పైసల మేర స్వల్పంగా పెంచింది ప్రభుత్వం. రాయితీ లేని ఎల్​పీజీ సిలిండర్​ రేటును రూ.19 మేర పెంచారు.

ఇదీ చూడండి : ఈ-చెత్త తెచ్చిస్తే ఇయర్​ఫోన్స్​, డేటా కేబుల్స్​ ఫ్రీ

ABOUT THE AUTHOR

...view details