తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నరేంద్ర మోదీ పంద్రాగస్టు​ ప్రసంగం హైలైట్స్​ - అవినీతి

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. నవ భారత నిర్మాణం దిశగా ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఉద్ఘాటించారు.

నరేంద్ర మోదీ పంద్రాగస్టు​ ప్రసంగం హైలైట్స్​

By

Published : Aug 15, 2019, 10:50 AM IST

Updated : Sep 27, 2019, 2:04 AM IST

మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు....

  • అధికరణ 370 రద్దు తర్వాత ఒకే దేశం, ఒకే రాజ్యాంగ స్ఫూర్తి కల సాకారమైంది.. ఇది దేశం గర్వించదగ్గ విషయం.
  • 'జనాభా విస్ఫోటనం' రాబోయే తరాలకు కొత్త సవాళ్లను సృష్టిస్తుంది. జనాభా పెరుగుదలను అరికట్టే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు ప్రారంభించాలి.
  • దేశంలో పర్యటక రంగ పురోగతికి ఎన్నో అవకాశాలున్నాయి. 2022 నాటికి ప్రతి ఒక్కరూ దేశంలోని 15 పర్యటక ప్రదేశాల్లో పర్యటించండి.
  • త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం, సమర్థ నాయకత్వం కోసం చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​ పేరిట ప్రత్యేక వ్యవస్థ.
  • జీఎస్​టీ అమలుతో ఒకే దేశం-ఒకే పన్ను కల సాధ్యమైంది. విద్యుత్​ రంగంలోనూ ఒకే దేశం-ఒకే గ్రిడ్​ను నెరవేర్చుకున్నాం.
  • 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దేశాన్ని ఉన్నతస్థాయిలో నిలిపేందుకు ఇది అత్యవసరం.
  • వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్​ ఆవిర్భవిస్తుంది.
  • సులభతర వాణిజ్య విధానంలో ప్రపంచ దేశాల్లో భారత్​ను తొలి 50లోపు ర్యాంకులో నిలపడమే లక్ష్యం.
  • అభివృద్ధి కోసం ఎక్కువ కాలం ఎదురుచూసే పరిస్థితుల్లేవు. హై జంప్​ తప్పనిసరి. ఈ దిశగా చర్యలు ప్రారంభిస్తాం.
  • ఆధునిక మౌలిక వసతుల కల్పన కోసం రూ. 100 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం.
  • ఇంటింటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా రూ. 3.5 లక్షల కోట్లతో 'జల్​ జీవన్​ మిషన్​' పథకం ప్రకటన.
  • 'ముమ్మారు తలాక్​ రద్దు'తో ముస్లిం మహిళల మెరుగైన జీవనానికి తోడ్పాటు అందించాం. ఈ చారిత్రక నిర్ణయాన్ని రాజకీయ కోణంలో చూడరాదు.
  • ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారికి వ్యతిరేకంగా భారత్​ నిరంతరం పోరాడుతుంది.
  • ఉగ్రవాదంపై పోరుకు అన్ని దేశాలు కలిసి రావాలి.
  • 2014-19 దేశ ప్రజల అవసరాలను తీర్చిన యుగం అయితే.. 2019 నుంచి వారి ఆకాంక్షలు, కలలు సాకారం చేసే దిశగా పయనిద్దాం.
  • అవినీతి, నల్లధనం నిర్మూలనలో ప్రతి ఒక్క ప్రయత్నం స్వాగతించదగ్గదే. భారతదేశాన్ని 70 ఏళ్లుగా నాశనం చేసిన ప్రమాదకర జబ్బు... అవినీతి.
  • ప్రజల జీవనంలో ప్రభుత్వం పాత్ర పరిమితంగా ఉండాలి.
  • ప్రజలు తమ ఆకాంక్షలను నెరవేర్చుకునే విధంగా వారికి స్వేచ్ఛనివ్వండి. ఇందులో భాగంగా సరైన పర్యావరణ వ్యవస్థ రూపొందించనివ్వండి.
  • భారత్​ త్వరలో బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత దేశంగా అవతరిస్తుంది.

ఇదీ చూడండి:

Last Updated : Sep 27, 2019, 2:04 AM IST

ABOUT THE AUTHOR

...view details