తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో కరోనా పంజా- ఒక్కరోజే 178 మంది బలి - మహారాష్ట్ర కేసులు

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహరాష్ట్రలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సోమవారం అత్యధికంగా 178 మంది వైరస్​ బాధితులు మరణించారు. కొత్తగా 2,786 కేసులు నమోదయ్యాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ వైరస్​ పంజా విసురుతోంది.

Highest single-day spike of 178 deaths reported in Maharashtra today
మహారాష్ట్రలో అత్యధికంగా 178 కరోనా మరణాలు

By

Published : Jun 15, 2020, 10:58 PM IST

Updated : Jun 15, 2020, 11:27 PM IST

మహారాష్ట్రలో కరోనా వైరస్​ ఉగ్రరూపం దాల్చింది. తాజాగా వైరస్​ బారినపడి 178 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులో ఇదే అత్యధికం. ఇప్పటివరకు రాష్ట్రంలో 4,128 మంది మరణించారు. కొత్తగా 2,786 కసులు వెలుగుచూడగా.. మొత్తం బాధితుల సంఖ్య 1,10,744కు చేరింది.

భారత్​లో కరోనా గణాంకాలు

ఒక్క ముంబయిలోనే సోమవారం 1,066 కేసులు నమోదయ్యాయి. 59,201 మందికి ఇప్పటివరకు వైరస్​ నిర్థరణ అయ్యింది. 58 మంది మరణించారు. మరణాలు 2,248గా ఉన్నాయి.

అయితే సోమవారం ఒక్క రోజే 5,071మంది రోగులు డిశ్చార్జ్​ అయ్యారని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్​ తోపే వెల్లడించారు.

దిల్లీలో...

దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి​ ఆందోళనకరంగా ఉంది. తాజాగా 1,647 కేసులు వెలుగుచూశాయి. దీంతో దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 42,829కు చేరింది. మరో 7 3మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకు 1,400 మంది కరోనాకు బలయ్యారు.

పెద్దసంఖ్యలో కేసులు నమోదయిన రాష్ట్రాలు

మధ్యప్రదేశ్​లో...

మధ్యప్రదేశ్​లో సోమవారం 133 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్​ బాధితుల సంఖ్య 10,935కు చేరింది.

బంగాల్​లో...

బంగాల్​ రాష్ట్రంలో తాజాగా 407 మందికి వైరస్​ సోకింది.. 10 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 11,494గా ఉండగా.. ఇప్పటివరకు 485 మంది మృతిచెందారు.

రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం కొత్త కేసులు మొత్తం కేసులు
మహారాష్ట్ర 2,786 1,10,744
దిల్లీ 1,647 42,829
ఉత్తర్​ప్రదేశ్​ 476 14,091
బంగాల్​ 407 11,494
రాజస్థాన్​ 287 12,981
జమ్ముకశ్మీర్​ 182 5,223
మధ్యప్రదేశ్​ 133 10,935
ఒడిశా 146 4,055
ఉత్తరాఖండ్​ 17 1,836
పుదుచ్చేరి 8 202
నాగాలాండ్​ 9 177
Last Updated : Jun 15, 2020, 11:27 PM IST

ABOUT THE AUTHOR

...view details