దాదాపు 500 మంది ఉగ్రవాదులు దేశంలో అలజడులు సృష్టించడానికి సరిహద్దు ప్రాంతంలో సిద్ధంగా ఉన్నట్టు భారత నిఘావర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లను సమర్థంగా తిప్పికొట్టేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది భారత ప్రభుత్వం.
కశ్మీర్లోకి చొరబడేందుకు ఉగ్ర లాంచ్ పాడ్లవద్ద 450-500 మంది ముష్కరులు సిద్ధంగా ఉన్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. వీరిలో కొందరు భారత వైమానిక దాడిలో ధ్వంసమైన బాలాకోట్ ఉగ్రస్థావరంలో శిక్షణ పొందారని అధికారులు స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆధారిత ఉగ్రమూకలు భారత్లోని కీలక నగరాల్లో అలజడులు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.