తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడులో బ్యానర్ల ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్​సిగ్నల్​

భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ తమిళనాడుకు వస్తున్న నేపథ్యంలో వారిని స్వాగతిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లు వేయకూడదని స్పష్టం చేసింది.

By

Published : Oct 3, 2019, 6:57 PM IST

తమిళనాడులో బ్యానర్ల ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్​సిగ్నల్​

తమిళనాడులో బ్యానర్లపై ఇటీవల నిషేధం విధించిన మద్రాసు హైకోర్టు స్వల్ప సడలింపు ఇచ్చింది. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్ తమిళనాడు పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో బ్యానర్ల ఏర్పాటుకు అనుమతినిచ్చింది.

తమిళనాడు మామళ్లపురంలో అక్టోబర్ 11-13 తేదీల్లో మోదీ, జిన్​పింగ్​ భేటీ కానున్నారు. ఈ సందర్భాన ఇరువురిని స్వాగతిస్తూ బ్యానర్లను ఏర్పాటు చేసేందుకు హైకోర్టు అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు సమ్మతించిన హైకోర్టు.. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు పాటించాలని సూచించింది. అయితే.. ఇతర రాజకీయ పార్టీలు బ్యానర్లు వినియోగించరాదని ఆదేశించింది.

కమల్​హాసన్​ స్పందన..

మద్రాస్​ హైకోర్టు తీర్పును తప్పుబట్టారు మక్కల్​ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్​హాసన్​. 'బాధ్యత కలిగిన వ్యక్తిగా బ్యానర్ల సంస్కృతిని అంతం చేయాలంటూ' మోదీని విజ్ఞప్తి చేశారు కమల్​.

కొన్ని రోజుల క్రితం ప్రైవేటు సంస్థకు చెందిన బ్యానర్​ వల్ల ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మద్రాసు హైకోర్టు.. బ్యానర్లను నిషేదిస్తూ తీర్పునిచ్చింది.

ఇదీ చూడండి:కశ్మీర్​ సహా పలు అంశాలపై పాంపియో-జైశంకర్​ చర్చ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details