జమ్ముకశ్మీర్ కుప్వారాలో పాకిస్థాన్ అనుబంధ నార్కో-టెర్రర్ మాడ్యూల్‌ను హంద్వారా పోలీసులు ఛేదించారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ముగ్గురుని అరెస్టు చేశారు. వీరి నుంచి 21 కిలోల హెరాయిన్, 1.34 కోట్ల విలవ చేసే భారత కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతో వీరిని పట్టుకున్నట్లు వెల్లడించారు.
ఈ 21 కిలోల హెరాయిన్ అంతర్జాతీయ మార్కెట్లో రూ.100 కోట్లు విలువ చేస్తుందని పేర్కొన్నారు. వీటితో పాటు నగదు లెక్కించే మిషన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.