ఓ ఏనుగుల గుంపు రహదారిపై చెరుకు లోడుతో వెళ్తున్న ఓ లారీని ఆపేశాయి. అందులోని చెరుకు గడలను ఎంచక్కా తినేశాయి. ఈ ఘటన కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని అసనూర్ ప్రాంతంలో జరిగింది. సంబంధిత దృశ్యాలను ఆ లారీ డ్రైవర్ తన చరవాణిలో బంధించాడు.
లారీ ఆపి మరీ చెరుకు తిన్న ఏనుగుల గుంపు - The lorry driver
కర్ణాటక-తమిళనాడు సరిహద్దు వద్ద అసనూర్లో ఓ ఏనుగుల గుంపు లారీని అడ్డగించి అందులోని చెరుకును ఆరగించాయి. దీనికి సంబంధించిన దృశ్యాలను లారీ డైవర్ తన చరవాణిలో బంధించాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
లారీ ఆపి చెరుకు తిన్న ఏనుగుల గుంపు
గజరాజులు చెరుకు తింటోంటే అడ్డగించకుండా వాహనంలోనే ఉండిపోయాడు డ్రైవర్. ఫలితంగా.. బెంగళూరు-దిండిగల్ జాతీయ రహదారిపై అరగంటకుపైగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కొంత చెరుకు తిన్న తర్వాత ఆ ఏనుగుల సమూహం అక్కడి నుంచి వెనుదిరిగింది.
ఇదీ చూడండి:భార్యను వేధిస్తున్న డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్
Last Updated : Sep 30, 2020, 10:35 PM IST