తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హెరాల్డ్ కేసులో స్వామి విచారణ

హెరాల్డ్ కేసు పిటిషనర్​, భాజపా నేత సుబ్రమణియన్​ స్వామి  క్రాస్ ఎగ్జామినేషన్​ ప్రారంభమైంది. త‌దుప‌రి విచార‌ణ 23కు వాయిదా పడింది.

నేష‌నల్ హెరాల్డ్

By

Published : Feb 4, 2019, 8:07 PM IST

నేష‌నల్ హెరాల్డ్ కేసులో తమపై క్రిమినల్​ కేసులు పెట్టిన భాజపా నేత సుబ్ర‌మ‌ణియన్ స్వామిపై కాంగ్రెస్​ అగ్రనేత సోనియా గాంధీ, అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్రతిచర్యకు దిగారు.

దిల్లీ పటియాలా హౌస్​ కోర్టులో క్రాస్ ఎగ్జామినేష‌న్‌ ప్రారంభించారు. తమ న్యాయవాది ద్వారా స్వామిని ప్రశ్నించారు.

నేషనల్​ హెరాల్డ్​ పత్రిక నడిపే అసోసియేటెడ్​ జర్నల్స్ లిమిటెడ్-ఏజేఎల్​​కు చెందిన ఆస్తుల్ని కాజేసేందుకు సోనియా, రాహుల్​ కుట్ర పన్నారన్నది స్వామి అభియోగం.

కాంగ్రెస్​ పార్టీకి ఏజేఎల్​ బకాయిపడ్డ రూ.90.25కోట్లు వసూలు చేసే హక్కును రూ.50లక్షలు చెల్లించడం ద్వారా సోనియా, రాహుల్​, ఇతర పార్టీ నేతలు పొందారని ఆరోపిస్తూ కేసు నమోదుచేశారు.

నేష‌నల్ హెరాల్డ్

ABOUT THE AUTHOR

...view details