తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మమతది కిమ్​జోంగ్​ వ్యక్తిత్వం: గిరిరాజ్​ - bengal

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్రమంత్రి గిరిరాజ్​ సింగ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

గిరిరాజ్​ సింగ్​, కేంద్రమంత్రి

By

Published : Jun 10, 2019, 12:39 PM IST

బంగాల్​ సీఎం మమతా బెనర్జీ నియంతలా వ్యవహరిస్తున్నారని కేంద్రమంత్రి గిరిరాజ్​ సింగ్​ ఆరోపించారు. రాష్ట్రంలో ఇతర పార్టీల ర్యాలీలకు అనుమతించరని విమర్శించారు. భాజపా, తృణమూల్​ కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణలో నలుగురు మృత్యువాత పడటంపై స్పందించారు కేంద్రమంత్రి.

గిరిరాజ్​ సింగ్​, కేంద్రమంత్రి

"రాజ్యాంగం ద్వారా చేసే శాసనంపై మమతా బెనర్జీకి నమ్మకం లేదు. ప్రధాన మంత్రినీ లెక్కచేయరు. వ్యవస్థలో ఇమడలేరు. వారి పతనం ప్రారంభమయింది. బంగాల్​లో ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. కిమ్​జోంగ్​లాగా మమత వ్యవహరిస్తున్నారు. ఎవరైనా వ్యతిరేకిస్తే వారిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీల ర్యాలీలనూ అనుమతించరు. ప్రజలు వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. మట్టిలో కలిపేస్తారు."

-గిరిరాజ్​ సింగ్​, కేంద్రమంత్రి

ఇదీ చూడండి': ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ.. సంక్షేమంపై లేదు

ABOUT THE AUTHOR

...view details