తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు ఝార్ఖండ్​ ముఖ్యమంత్రిగా హేమంత్​ ప్రమాణం - JMM LATEST NEWS

ఝార్ఖండ్​ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్​ సోరెన్​ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాంచీలోని ముర్హాబాది మైదానంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. బంగాల్​ ముఖ్యమంత్రి మమత, కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Hemant Soren
నేడు ఝార్ఖండ్​ ముఖ్యమంత్రిగా హేమంత్​ ప్రమాణం

By

Published : Dec 29, 2019, 5:04 AM IST

Updated : Dec 29, 2019, 9:55 AM IST

నేడు ఝార్ఖండ్​ ముఖ్యమంత్రిగా హేమంత్​ ప్రమాణం

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్​-ఆర్​జేడీ కూటమి ఘన విజయం సాధించింది. కూటమికి నేతృత్వం వహిస్తున్న జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్​ సోరెన్​ నేడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్​ ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు.

ముర్హాబాదిలో ఘనంగా ఏర్పాట్లు..

ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ముర్హాబాది మైదానంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. నేడు మధ్యాహ్నం 2 గంటకు ఝార్ఖండ్​ ముఖ్యమంత్రిగా సోరెన్​ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సోనియా, రాహుల్​ హాజరు!

హేమంత్​ సోరెన్​ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ హాజరవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వారితో పాటు కాంగ్రెస్​ ముఖ్యనేతలు హాజరవుతారని తెలిపాయి. ఇప్పటికే పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఝార్ఖండ్​ చేరుకున్నారు.

కూటమి ఘన విజయం..

81 స్థానాలు ఉన్న ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్​-ఆర్​జేడీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 47 (జేఎంఎం-30, కాంగ్రెస్​-16, ఆర్​జేడీ-1) స్థానాల్లో గెలుపొంది సాధారణ మెజార్టీ కన్నా 5 సీట్లు ఎక్కువ సాధించింది. ఈ ఎన్నికల్లో అధికార భాజపా పార్టీ 25 స్థానాలతో సరిపెట్టుకుని అధికారాన్ని కోల్పోయింది.

38 ఏళ్లకే సీఎంగా తొలిసారి బాధ్యతలు..

పోటీ చేసిన తొలి ఎన్నికల్లో ఓటమి చెందినా.. సోదరుడి మృతితో పార్టీ పగ్గాలు చేపట్టారు సోరెన్​. 2009-10 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అర్జున్​ ముండా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ తర్వాత 2013 జులైలో 38 ఏళ్లకే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2014 డిసెంబర్​ వరకు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నది కేవలం 17 నెలలే అయినా పాలనలో తనదైన ముద్ర వేశారు సోరెన్​.

కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపాను ఓడించేందుకు కాంగ్రెస్​, ఆర్జేడీతో జట్టుకట్టి విజయం సాధించారు హేమంత్​. రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.

ఇదీ చూడండి: 'నిజమనే పర్వతాన్ని అబద్ధమనే పొదతో కప్పుతున్నారు'

Last Updated : Dec 29, 2019, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details