ఝార్ఖండ్‌లో విపక్షాలు ఏకమై తమ ఐకమత్యాన్ని చాటిచెప్పాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేసిన తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా భాజపాయేతర నేతలు తరలివెళ్లి తమ మద్దతును ప్రకటించారు. పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో విపక్షాల ఐకమత్యానికి ప్రాధాన్యం ఏర్పడింది.
11వ ముఖ్యమంత్రిగా...
రాంచీలోని మోరాబది మైదానంలో ఝార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఈ వేడుకలో సోరెన్‌తో పాటు ముగ్గురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే అధినేత స్టాలిన్, సీపీఎం, సీపీఐ నేతలు సీతారాం ఏచూరీ, డి. రాజా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సహా పలువురు అగ్రనేతలు హాజరయ్యారు.
ఝార్ఖండ్‌లో నెలకొన్న సంకీర్ణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, ప్రజాభివృద్ధి, శాంతికి నిరంతర కృషి చేస్తుందని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధాని శుభాకాంక్షలు