ఈశాన్య రాష్ట్రం సిక్కింలో భారీగా మంచు కురుస్తోంది. ఫలితంగా.. జనజీవనం స్తంభించింది. రాష్ట్రంలో ఈ సీజన్‌లో మంచు కురవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లాచెన్, లాచుంగ్, జులుక్, కుపూప్ ప్రాంతాల్లో మంచుదుప్పటి పరుచుకుంది.
సిక్కింలో భారీగా మంచువర్షం.. స్తంభించిన జనజీవనం - సిక్కిం తాజా వార్తలు
సిక్కింలో ఈ సీజన్‌లో తొలిసారి హిమపాతం నమోదైంది. భారీగా కురుస్తున్న హిమపాతంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పకుంది. రాబోయే రోజుల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

సిక్కింలో భారీగా మంచువర్షం
సిక్కింలో భారీగా మంచువర్షం
రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచు వర్షం కురుస్తుందని సిక్కిం వాతావరణ శాఖ తెలిపింది. హఠాత్తుగా కురుస్తున్న మంచు వల్ల చాలా మంది పర్యటకులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఇబ్బందిగా ఉన్నా హిమపాతాన్ని ఆస్వాదిస్తున్నట్లు చెబుతున్నారు సందర్శకులు.