దేవభూమి హిమాచల్ ప్రదేశ్లోని పర్యటక ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. కిన్నౌర్, కుల్లూ, మనాలీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. ఆ ప్రాంతమంతా అడుగుల మేర మంచు దుప్పటి పరుచుకోవటం వల్ల జనజీవనం స్తంభించింది.
హిమాచల్లో హిమపాత ప్రభావిత ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. జాతీయ రహదారి సహా 12కు పైగా ప్రధాన రహదారులను మూసివేశారు అధికారులు. కొన్ని బస్సులను దారి మళ్లించగా.. మరికొన్నింటిని రద్దు చేసింది హిమాచల్ ఆర్టీసీ. చిత్కుల్, నాకొ, హాంగొ, చులింగ్, సంగ్లా ప్రాంతాల్లో మొబైల్ సేవలు నిలిచిపోయాయి.