తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో రైతన్నల నిరసనలు- చర్చలకు కేంద్రం పిలుపు - ఛలో దిల్లీ వార్తలు

Heavy security deployment at Singhu boarder in Delhi-Haryana. where protesting farmers are gathered
దిల్లీ సింఘు సరిహద్దులో భారీగా బలగాల మోహరింపు

By

Published : Nov 28, 2020, 8:59 AM IST

Updated : Nov 28, 2020, 9:25 PM IST

19:56 November 28

రైతుల ఆందోళనలపై స్పందించిన షా..

  • దిల్లీలో రైతుల ఆందోళనపై స్పందించిన హోంమంత్రి అమిత్‌షా
  • రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధం: అమిత్‌షా
  • వచ్చే నెల 3న చర్చలకు వ్యవసాయ మంత్రి ఆహ్వానించారు: అమిత్‌షా
  • రైతుల అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది: అమిత్‌షా
  • అనేక రోడ్లపై రైతులు తమ ట్రాక్టర్లు, ట్రాలీలు ఉంచుతున్నారు: అమిత్‌షా
  • దిల్లీ పోలీసులు చూపించిన చోటుకు వాహనాలు తరలించాలని వినతి
  • అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేసుకోవచ్చు: అమిత్‌షా

17:30 November 28

రైతు సంఘాలు నిర్వహిస్తున్న 'ఛలో దిల్లీ' ఆందోళనలపై ప్రతిపక్షాలు స్పందించాయి. దిల్లీలో రైతులు నిరసన చేపట్టేందుకు కేటాయించిన స్థలం సరిపోదని, ఇంకా పెద్ద దాన్ని కేటాయించాలని తెలిపాయి. ఈ మేరకు ఎన్సీపీ నేత శరద్ పవార్​, డీఎంకే నేత టీఆర్​ బాలు, సీపీఐ(ఎం) నేత ఏచూరి సీతారాం సహా ఇతర పార్టీల నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

16:00 November 28

'ఇక్కడే ఉంటాం.. నిరసనలు కొనసాగిస్తాం'

నిరసనలు కొనసాగించాలని, దిల్లీని విడిచిపెట్టి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు భారతీయ కిసాన్​ యూనియన్​ ప్రధాన కార్యదర్శి హరిందర్​ సింగ్​ వెల్లడించారు. సింఘ వద్ద ఉన్న దిల్లీ-హరియాణా సరిహద్దులో జరిగిన రైతుల సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

15:05 November 28

దిల్లీ చలో...

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. అదే సమయంలో దిల్లీకి రైతుల తాకిడి భారీగా పెరుగుతోంది. 'దిల్లీ చలో'లో పాల్గొనేందుకు పంజాబ్​-హరియాణా సరిహద్దులోని సంబాలో భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లు, బస్సుల్లెక్కి దిల్లీవైపు సాగుతున్నారు. 

14:57 November 28

'ఆందోళనల్లో..'

రైతుల ఆందోళనలపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ స్పందించారు. రైతుల మధ్య కొన్ని అవాంఛిత అంశాలు కనపడతున్నాయన్నారు. కొందరు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారని ఆరోపించారు. తమకు ఈ వ్యవహారంపై సమాచారం ఉందని, త్వరలోనే బయటపెడతామని స్పష్టం చేశారు.

10:51 November 28

'చట్టాలను వెనక్కు తీసుకునే వరకు ఆందోళన'

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ ఆందోళన శనివారమూ కొనసాగుతోంది. చట్టాలకు వెనక్కి తీసుకునే వరకు రాజధానిలోనే బైఠాయిస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు. బురారీలోని నిరంకారీ మైదానంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతించినా.. పంజాబ్‌-హరియాణాకు చెందిన రైతులు సింఘులో ఇంకా తమ నిరసనను విరమించలేదు. అక్కడే బైఠాయించి తమ ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. 

పంజాబ్‌ నుంచి దిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో వారితో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నారు. రాత్రంతా రహదారులపైనే వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి రైతులు తమ నిరసనని కొనసాగించారు. 

టిక్రీలోనూ..

దిల్లీ సరిహద్దు ప్రాంతమైన టిక్రీలో శనివారమూ భారీ స్థాయిలో భద్రతా బలగాల్ని మోహరించారు. ఇప్పటి వరకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 30 మంది రైతులు నిరంకారీ మైదానానికి చేరుకున్నారు. మధ్యాహ్నానికి మరికొంత మంది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం చాలా మంది రైతు సంఘాల నాయకులు మైదానానికి రావడానికి సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు.

మరిన్ని రాష్ట్రాల నుంచి..

మరికొన్ని రాష్ట్రాల రైతులు కూడా ఇవాళ ఆందోళనలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఆయా రాష్ట్రాల నుంచి రైతులు బృందాలుగా బయలుదేరారని తెలుస్తోంది. పంజాబ్‌లోని ఫతేగఢ్‌ నుంచి మరికొంత మంది రైతులు ట్రాక్టర్లలో బయలుదేరారు. 

చర్చలకు ఆహ్వానం..

ఈ పరిణామాల నడుమ డిసెంబరు 3న చర్చలు చేపట్టేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అప్పటి వరకు రైతులు ఆందోళనను విరమించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కోరారు.

10:48 November 28

ప్రభుత్వం విఫలమైంది..

రైతుల సమస్యలపై స్పందించటంలో ప్రభుత్వం విఫలమైందని యూపీ మేరఠ్​లోని భారతీయ కిసాన్ సమాఖ్య ప్రతినిధి రాకేశ్ తికాయిట్ ఆరోపించారు. ప్రస్తుతం తాము దిల్లీ వైపు సాగుతున్నామని తెలిపారు. 

10:04 November 28

చర్చలకు ఆహ్వానించిన కేంద్రం..

విద్యుత్​, వ్యవసాయ చట్టాలపై చర్చించాలని రైతుల డిమాండ్

  • డిసెంబరు 3న రైతు సంఘాలను చర్చలకు పిలిచిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి
  • విద్యుత్ సవరణ బిల్లుపై చర్చించాలని రైతు సంఘాల డిమాండ్
  • వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, పంటలకు మద్దతు ధరపై చర్చించాలని డిమాండ్
  • వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం
  • మైదానంలో రైతుల కోసం తాగునీరు ఏర్పాటు చేసిన దిల్లీ ప్రభుత్వం

09:50 November 28

జాతీయ రహదారి నిర్బంధం..

  • నిరంకారి మైదానంలో సమావేశమైన రైతులు, కార్యాచరణపై చర్చ
  • దిల్లీ సరిహద్దుల్లో భారీగా బలగాల మోహరింపు
  • టిక్రీ, సింఘు సరిహద్దుల్లో భారీగా బలగాల మోహరింపు
  • సింఘు సరిహద్దుకు అధిక సంఖ్యలో చేరుకున్న రైతులు
  • దిల్లీ సరిహద్దులోని ఎన్‌హెచ్-44ను నిర్బంధించిన రైతులు

09:23 November 28

బురారీ ప్రాంతంలోని నిరంకారి మైదానంలో రైతులు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో టిక్రీ సరిహద్దు ప్రాంతంలో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు.

08:12 November 28

నిరంకారి మైదానంలో రైతులు- కార్యాచరణపై భేటీ

దిల్లీ- హరియాణా సరిహద్దులో భారీ భద్రతను మోహరించింది కేంద్రం. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సింఘు ప్రాంతం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.

ఆందోళనల్లో భాగంగా 'ఛలో దిల్లీ' కార్యక్రమానికి పిలుపునిచ్చిన రైతులు.. శుక్రవారం దేశ రాజధానిలోకి ప్రవేశించారు. దిల్లీలోని పెద్ద మైదానాల్లో ఒకటైన బురారిలోని నిరంకారి మైదానంలో నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతి ఇవ్వగా.. రైతులంతా అక్కడికి చేరుకున్నారు. కాగా.. అధిక సంఖ్యలో ఇంకా సింఘు సరిహద్దులోనే ఉన్నారు.

రైతు నాయకుల భేటీ..

నిరంకారి మైదానానికి చేరుకున్న రైతులు.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడానికి సమావేశం నిర్వహించారు. దిల్లీలో నిరసనలు చేపట్టాలా లేదా అన్న విషయంపై సమాలోచనలు చేస్తున్నారు. 

ఇదీ చదవండి:కశ్మీర్​లో స్థానిక ఎన్నికల తొలిదశ పోలింగ్​ షురూ..

Last Updated : Nov 28, 2020, 9:25 PM IST

ABOUT THE AUTHOR

...view details