తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో ఉరుములతో వర్షం.. విమానాల దారి మళ్లింపు - దిల్లీలో వర్షం-విమానాలు దారి మళ్లింపు

గురువారం సాయంత్రం దిల్లీలో ఆకస్మికంగా వర్షం కురిసింది. వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. వాతావరణంలో కాలుష్యం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్న కారణంగా 17విమానాలను దారి మళ్లించారు.

heavy rains lashes out some parts of delhi
దిల్లీలో వర్షం

By

Published : Dec 12, 2019, 11:59 PM IST

దేశ రాజధాని దిల్లీలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. 1.9 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆకస్మిక వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

వర్షం కారణంగా వాయు నాణ్యత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పశ్చిమ తీరం నుంచి బలమైన గాలులు వీచిన కారణంగా వర్షం కురిసిందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఉష్ణోగ్రత గరిష్ఠంగా 21.5 డిగ్రీలు, కనిష్ఠంగా 12.8 డిగ్రీలు నమోదయిందని స్పష్టం చేశారు.

విమాన మార్గాలు మళ్లింపు...

వాతావరణం ప్రతికూలంగా ఉన్న కారణంగా 17 విమాన సర్వీసులను దారి మళ్లించారు. జైపుర్, అహ్మదాబాద్​, అమృత్​సర్, లఖ్​నవూ​లకు మళ్లించినట్లు వెల్లడించారు. మొదట 10 నిమిషాల పాటు రన్​వేను నిలిపేసిన అధికారులు వర్షం తీవ్రరూపు దాల్చిన కారణంగా దారి మళ్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

దిల్లీలో వర్షం

ABOUT THE AUTHOR

...view details