బిహార్ రాజధాని పట్నా అస్తవ్యస్తంగా మారింది. వరుణుడి ప్రకోపానికి జనజీవనం స్తంభించింది. ఎటు చూసినా నీరే కనిపిస్తుండటం.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడం వల్ల ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నిత్యావసరాలు అందక నానా తంటాలు పడుతున్నారు.
పట్నాలోని రాజేంద్రనగర్, కన్కర్బాగ్, లంగర్ టోలీ, బహదూర్పుర్, రాజీవ్‌నగర్, పోస్టల్ పార్క్, ఇందిరానగర్, అశోక్‌నగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజధానివ్యాప్తంగా 3 రోజులపాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ.
1975 తర్వాత ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా మంగళవారం వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఇంతటి గడ్డు పరిస్థితికి సంబంధించిన కొన్ని చిత్రాలను ఈటీవీ భారత్ చిత్రీకరించింది.