దేశ రాజధాని దిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా కొన్ని గంటలపాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ముంపునకు గురైన ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
దిల్లీలో భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం - దిల్లీలో భారీ వర్షాలు
దిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దిల్లీని ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో వాహనాలు వరదల్లో చిక్కుకున్నాయి.
దిల్లీని కమ్మేస్తున్న భారీ వర్షాలు
భారీ వర్షానికి మింట్ వంతెన కింద భారీగా నీరు చేరగా.. అందులో ఓ బస్సు చిక్కుకుంది. బస్సు టాప్‌పైకి ఎక్కి ప్రయాణికులు సాయం కోసం కేకలు వేశారు. స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సిబ్బంది నిచ్చెన సాయంతో ప్రయాణికులను రక్షించారు.
ఇదీ చదవండి:మూగ ప్రేమ పాఠాలు
Last Updated : Jul 19, 2020, 11:03 AM IST