చెన్నైలో మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక రహదారులు జలమయం అయ్యాయి. ఫలితంగా స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరిలోని విల్లుపురం, చెంగల్పట్టు, చెన్నై, కాంచీపురం, కడలూరు, నాగపట్టణం, తిరువన్నామలై జిల్లాలో వర్షం సూచనలున్నట్లు తెలిపింది.