తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ వర్షాలు, ఈదురుగాలులతో 'ముంబయి' గజగజ - floods news

మహారాష్ట్ర రాజధాని ముంబయి మహానగరం భారీ వర్షాలతో గజగజ వణికిపోతోంది. ఈదురుగాలులతో నగరంలోని బీఎస్​ఈ భవనంపై ఉన్న బోర్డు నుంచి.. ఎత్తైన హోర్డింగులు, క్రేన్లు, నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. రెండు లోకల్​ రైళ్లు వరదలో చిక్కుకున్నాయి. రంగంలోకి దిగిన ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు ప్రయాణికులను కాపాడారు.

heavy-rains-in-mumbai
భారీ వర్షాలు, ఈదురుగాలులతో 'ముంబయి' గజగజ

By

Published : Aug 5, 2020, 11:04 PM IST

భారీ వర్షాలకు మహారాష్ట్ర రాజధాని ముంబయి అతలాకుతలమవుతోంది. వర్షాలకు తోడు ఈదురుగాలులతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద క్రేన్లు, నిర్మాణాలు, హోర్డింగులు ధ్వంసమయ్యాయి. రహదారులు వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది.

భారీ వర్షాలు, ఈదురుగాలులతో 'ముంబయి' గజగజ

వరదల్లో లోకల్​​ రైళ్లు..

ధ్వంసమైన ట్రాక్​

ముంబయిలో కురుస్తోన్న భారీ వర్షాలకు రెండు లోకల్​ రైళ్లు వరదలో చిక్కుకున్నాయి. మస్​జీద్​, భాయ్​ఖాలా స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్​లపై భారీగా వరద నీరు చేరి రైళ్లు నిలిచిపోయాయి. దాంతో జాతీయ విపత్తు స్పందన దళం రంగంలోకి దిగింది. రైళ్లలో ఉన్న 40 మంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.

ప్రయాణికులను రక్షిస్తోన్న ఎన్​డీఆర్​ఎప్​ బృందాలు

బీఎసీఈ.. బోర్డు ధ్వంసం..

భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా నగరంలోని జేఎన్​పీటీ వద్ద భారీ క్రేన్లు నేలకొరిగాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి భవనంపై ఉన్న బోర్డు పూర్తిగా ధ్వంసమైంది. అలాగే డీవై పాటిల్​ స్టేడియంలో భారీగా నష్టం వాటిల్లింది.

బీఎస్​ఈ భవనంపై ఉన్న బోర్డు ధ్వంసం

ఠాక్రేకు మోదీ ఫోన్​..

భారీ వర్షాలు కురుస్తున్న వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేతో ఫోన్​లో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వర్షాలతో ఏర్పడ్డ పరిస్థితులపై ఆరా తీశారు. అవసరమైన సాయం అందిస్తామని భరోసా కల్పించారు.

భారీ వర్షాలతో ముంబయి గజగజ

ఇదీ చూడండి: 'మహా'లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ABOUT THE AUTHOR

...view details