వరణుడి ప్రతాపానికి దేశంలోని పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. మహారాష్ట్రలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజస్థాన్, బిహార్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తి జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రవాణా వ్యవస్థ స్తంభించింది. పలు ప్రాంతాల్లో వందలాది ఇళ్లు నీట మునిగాయి.
కొట్టుకుపోయిన వంతెన
మహారాష్ట్ర ఠానేలోని కల్యాణ్-ముర్బాద్ వంతెన కొట్టుకుపోయింది. ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఉల్హాస్ నది ఉప్పొంగి బద్లాపుర్, టిట్వాలా, కల్యాణ్ ప్రాంతాల్లో 370 ఇళ్లు నీట మునిగాయి.