తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిమాచల్​లో​ భారీ వర్షాలు... 22 మంది మృతి

దేశవ్యాప్తంగా వర్షాలకు పలు రాష్ట్రాలు అతలకుతలమవుతున్నాయి. రెండు రోజుల నుంచి హిమాచల్​ ప్రదేల్​లో కురుస్తున్న వానలకు 22 మంది మృతి చెందగా, 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

By

Published : Aug 19, 2019, 6:46 PM IST

Updated : Sep 27, 2019, 1:30 PM IST

హిమాచల్​లో​ భారీ వర్షాలు... 22 మంది మృతి

హిమాచల్​ ప్రదేశ్​లో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 22 మంది మృతి చెందారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వానలకు వివిధ ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడటం, వరదలు ముంచెత్తటం వల్ల 500 మంది రోడ్ల మీదే నిలిచిపోయారు. జాతీయ విపత్తు దళాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటానికి పలు మార్గాలను అన్వేషిస్తున్నారు.

హిమాచల్​లో​ భారీ వర్షాలు... 22 మంది మృతి

వరదలు ముంచెత్తినందున త్రిండి, దన్ని, లాడోర్​, థనా, హిండోర్​ఘాట్​, జాసుర్​ ప్రాంత ప్రజలు నివాస స్థలాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. భారీ వర్షాలకు కాగ్రా జిల్లాలోని మంచి నీటి పైపు లైనులు విరిగిపోయాయి. పైపు లైన్లను పునరుద్ధరించటానికి రెండు, మూడు రోజులు పడుతుందని అధికారులు తెలిపారు.

పలు ప్రాంతాలలో కొండ చరియలు విరిగి పడటంతో రాష్ట్రంలోని ప్రధాన రహదారుల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. వరదలకు 22మంది మృతి చెందగా, పన్నెండు మంది గాయ పడ్డారు. 490 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు ప్రకటించారు.

ఇదీ చూడండి:తెహెల్కా తేజ్​పాల్ వ్యాజ్యం కొట్టేసిన సుప్రీంకోర్టు

Last Updated : Sep 27, 2019, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details