తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుండపోత వర్షాలకు గుజరాత్ గజగజ - gujarat floods amid corona

వరుణుడి ప్రకోపానికి గుజరాత్ రాష్ట్రం అతలాకుతలమైంది. నదులు ఉప్పొంగి.. వరద నీరు ఇళ్లలోకి చేరింది. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది.

heavy rains in gujarat in 2020
కుండపోత వర్షాలకు వణికుతున్న గుజరాత్!

By

Published : Aug 23, 2020, 4:34 PM IST

గుజరాత్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు పొటెత్తుతూనే ఉన్నాయి. నీల్‌కోల్‌లో రహదారులు జలమయమయ్యాయి. దాహోద్ జిల్లాలోని ఆనాస్‌ నదిలో ఒక్కసారిగా ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. వరదలకు ఇళ్లలోకి చేరిన నీటిని.. ఎత్తిపోయలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిత్యావసర సరకులు లభించడంలేదని.. తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

గుజరాత్ జలమయం
నిండుకుండగా.. చెరువులు ఉప్పొంగగా

కచ్‌ జిల్లాలో కుండపోత వర్షాలకు.. ప్రజలు ఇబ్బంది పడ్డారు. మెహసనా, నర్మదా జిల్లాల్లోనూ.. వర్షాలకు వరదలు పోటెత్తాయి. కచ్‌, ఆనంద్‌, భరూచ్, సూరత్‌లలో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.

మన వీధిలో స్విమ్మింగ్ పూలా?

ఆదివారం కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించడంతో.. గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో.... అన్నిరకాల సహాయక చర్యలను కొనసాగించాలని ముఖ్యమంత్రి విజయ్ రూపాని అధికారులను ఆదేశించారు.

రోడ్డును కప్పేసిన జలం
భారీ జల్లులకు.. నగరం వెలవెల

ఇదీ చదవండి: వరుణుడి ప్రకోపం.. మధ్యప్రదేశ్​లో వరద ఉగ్రరూపం!

ABOUT THE AUTHOR

...view details