తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరుణుడి ఉగ్రరూపంతో దేశ ప్రజలు విలవిల - కర్ణాటకలో వర్షాలు

వరుణుడి ప్రతాపానికి దేశంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. మధ్యప్రదేశ్​లో నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కర్ణాటకలో వ్యవసాయ క్షేత్రాలు నీట మునిగాయి.

Heavy rains created havoc in many parts of the country
వరుణుడి ఉగ్రరూపంతో దేశ ప్రజలు విలవిల

By

Published : Aug 17, 2020, 1:08 PM IST

దేశవ్యాప్తంగా వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. భారీ వర్షాల ధాటికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ, విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

మహారాష్ట్ర కొల్హాపుర్​లో ఇలా..

మధ్యప్రదేశ్​లో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జబల్​పుర్​లోని నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. దీంతో ప్రజలు రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇంట్లోకి చేరిన నీటితో ఇక్కట్లు
నీట మునిగిన ప్రాంతం
జబల్​పుర్​ వీధులు

జమ్ముకశ్మీర్​లో కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. జమ్ములోని సర్కులర్​ రోడ్​ ప్రాంతంలో రహదారికి బీటలు ఏర్పడ్డాయి. దీంతో అక్కడ నిలిపి ఉంచిన మూడు వాహనాలు గుంతలోకి పడిపోయాయి.

జమ్ములో పరిస్థితి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కర్ణాటకవ్యాప్తంగా పంట పొలాలు దెబ్బతిన్నాయి. బెలగావిలోని వ్యవసాయ క్షేత్రాలను వరద నీరు ముంచెత్తింది.

కర్ణాటకలోని వ్యవసాయ క్షేత్రాలు
భారీగా పంటనష్టం

ఇదీ చూడండి:-గుజరాత్​లో భారీ వర్షాలు- సూరత్​ వీధులు జలమయం

ఛత్తీస్​గఢ్​లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతినడం వల్ల గ్రామాల మధ్య సమాచార వ్యవస్థ దెబ్బతింది.

సుక్మాలో.. తమ సహొద్యోగి మృతదేహాన్ని భుజాలపై మోసుకెళుతూ ఇన్జ్రామ్​ నదిని దాటారు సీఆర్​పీఎఫ్​ జవాన్లు.

సీఆర్​పీఎఫ్​ జవాన్​ మృతదేహంతో నదిని దాటుతున్న సిబ్బంది

ఇదీ చూడండి:-వరదలో చిక్కుకున్న యువకుడు.. హెలికాఫ్టర్​తో సాయం

ABOUT THE AUTHOR

...view details