రాగల రెండు, మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది భారత వాతావరణ శాఖ. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడి.. తూర్పు తీరంవైపు మళ్లే అవకాశముందని తెలిపింది.
మరో 2 రోజుల్లో అక్కడ విస్తారంగా వర్షాలు - cyclones
అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. మరో 2 రోజుల్లో కోస్తాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.
మరో 2 రోజుల్లో అక్కడ విస్తారంగా వర్షాలు
ఈ ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ, మరాఠ్వాడా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించారు ఐఎండీ అధికారులు. రాగల 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు.
సముద్ర తీరం వెంబడి భీకర గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపిన ఐఎండీ.. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.