కర్ణాటక మాల్నాడు, తీర ప్రాంతాలకు భారీ వర్షపాతం పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన సన్నాహాలు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు రెవెన్యూ మంత్రి అశోక్ తెలిపారు.
ఈ మేరకు అధికారులతో మాట్లాడారు అశోక్. రాష్ట్రంలో వర్షపాతం, అంచనాలు, రిజర్వాయర్లలో నీటిస్థాయి వంటి విషయాలపై అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, కొడగు, శివమొగ్గ, చిక్కమగళూరు, హసన్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.
"జలాశయాల ప్రవాహం పెరుగుతోంది. 11 జిల్లాల కలెక్టర్లతో సంప్రదించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. చిక్కమగళూరు జిల్లాలోని శ్రుంగేరి, ముడిగెరే ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. ఒక్కొక్కరికి రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని చెప్పాను."