తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భానుడి ప్రతాపం నుంచి 24 గంటల్లో ఉపశమనం! - Mediterranean Sea.

మరో 24 గంటల తర్వాత నుంచి దేశంలో వేడిగాలులు తగ్గుముఖం పడతాయని తెలిపింది కేంద్ర వాతావరణ శాఖ (ఐఎండీ). అంతేకాకుండా మే 29, 30న దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

Heatwave likely to continue during next 24 hours: IMD
'భానుడి ప్రతాపం నుంచి 24 గంటల్లో ఉపశమనం'

By

Published : May 27, 2020, 8:21 PM IST

భారత వాతావరణ శాఖ(ఐఎండీ) దేశ ప్రజలకు తీపి కబురును అందించింది. ఇక ఒక్క రోజు ఆగితే భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొంది.

"వాయువ్య, మధ్య, తూర్పు భారత్​ నుంచి వీస్తున్న వేడి గాలుల వల్ల మరో 24 గంటల పాటు ఉష్ణోగ్రతలు ఇలానే కొనసాగుతాయి."

-కేంద్ర వాతావరణ శాఖ.

పశ్చిమ రాజస్థాన్​, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల మధ్య తీవ్రమైన వేడిగాలులు వీస్తున్న కారణంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశమనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉత్తర మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు.

దేశ రాజధాని దిల్లీ సఫ్దర్‌జంగ్, పాలం ప్రాంతాల్లో 45.9 -47.2 డిగ్రీల సెల్సియస్​ నమోదైందని... ఇవి గడిచిన 24 గంటలతో పోలిస్తే 0.1, 0.4 సెల్సియస్​ తక్కువ అని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి వేడిగాలులు తగ్గుముఖం పట్టనున్నట్లు వెల్లడించారు.

పలు ప్రాంతాల్లో వర్షాలు

దేశవ్యాప్తంగా ఈ శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:భారత్​లో కరోనా ఉగ్ర రూపం అప్పుడే!

ABOUT THE AUTHOR

...view details